|
|
by Suryaa Desk | Thu, Feb 12, 2026, 03:48 PM
దర్శకుడు నీరజ్ పాండే, మనోజ్ బాజ్‌పేయీ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఘూస్‌ఖోర్ పండత్’ సినిమా టైటిల్‌పై వివాదం దేశ అత్యున్నత న్యాయస్థానం వరకు చేరింది. ఒక వర్గాన్ని కించపరిచేలా పేరు ఉందని బ్రాహ్మణ సంఘం పిటిషన్ దాఖలు చేయగా, సుప్రీంకోర్టు చిత్ర బృందంపై మండిపడింది. సమాజంలో ఒక వర్గాన్ని తక్కువ చేసి చూపే అధికారం ఎవరికీ లేదని, వెంటనే సినిమా పేరు మార్చాలని కోర్టు ఆదేశించింది. కొత్త టైటిల్‌ను కోర్టుకు తెలియజేసి, ఏ వర్గాన్నీ కించపరచడం లేదని అఫిడవిట్ దాఖలు చేస్తేనే విడుదలకు అనుమతిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 19కి వాయిదా పడింది.
Latest News