|
|
by Suryaa Desk | Fri, Feb 13, 2026, 10:44 AM
ప్రస్తుత జీవితంలో మొబైల్ ఫోన్ ఒక భాగమైపోయింది. చాలా మంది ఉదయం లేవగానే వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియాలో గంటల తరబడి గడుపుతున్నారు. అయితే, తెలుగు, తమిళం, మలయాళం సినిమాల్లో నటించిన స్టార్ హీరోయిన్ రజిషా విజయన్ మాత్రం దీనికి భిన్నమైన జీవనశైలిని అనుసరిస్తోంది. ఆమె గత ఎనిమిదేళ్లుగా వాట్సాప్‌ను ఉపయోగించడం లేదు. కాలేజీ చదువు పూర్తయిన వెంటనే ఫేస్‌బుక్‌కు కూడా గుడ్‌బై చెప్పేసింది. ప్రస్తుతం ఆమె అరుదుగా ఇన్‌స్టాగ్రామ్‌ను మాత్రమే ఉపయోగిస్తోంది. వర్చువల్ ప్రపంచం కంటే నిజ జీవితానికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు రజిషా పేర్కొంది.ఎక్కువగా తమిళ సినిమాల్లో నటించే రజిషా తెలుగు ఆడియెన్స్ కు కూడా పరిచయమే. మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన రామారావు ఆన్ డ్యూటీలో హీరోయిన్ గా నటించిందీ అందాల తార. తన క్యూట్ లుక్స్, యాక్టింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇటీవల మోహన్ లాల్ నటించిన మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ కాలంకావల్ లోనూ ఓ కీలక పాత్ర పోషించిందీ ముద్దుగుమ్మ. సెలెక్టివ్ గా సినిమాలు ఎంచుకుంటోన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. తన పర్సనల్ అండ్ పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అలాగే సామాజిక మాధ్యమాల వినియోగం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
Latest News