|
|
by Suryaa Desk | Fri, Feb 13, 2026, 12:04 PM
రణవీర్ సింగ్, ఆదిత్య ధర్ ల కాంబినేషన్ లో వచ్చిన 'దురంధర్' చిత్రం 1100 కోట్ల గ్రాస్ వసూళ్లతో సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో, వీరిద్దరి కాంబోలో 'దురంధర్ 2' తో పాటు మరో భారీ మైథలాజికల్ యాక్షన్ మూవీ రానుందని ముంబై మీడియాలో ప్రచారం జరుగుతోంది. గతంలో ఆదిత్య ధర్, విక్కీ కౌశల్ తో 'ది ఇమ్మోర్టల్ ఆఫ్ అశ్వద్ధామ' అనే భారీ చారిత్రక చిత్రాన్ని ప్లాన్ చేసినా, బడ్జెట్ సమస్యల వల్ల అది ఆగిపోయింది. ఇప్పుడు జియో స్టూడియోస్ తో బి 62 స్టూడియోస్ ఒప్పందం కుదుర్చుకోవడంతో, ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తి నెలకొంది. అయితే, ఈ కొత్త చిత్రం అశ్వద్ధామ కథతోనేనా లేక కొత్త కథాంశంతోనా అన్నది ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుతం రణవీర్ సింగ్ 'దురంధర్ 2' ప్రమోషన్లపై దృష్టి సారించారు.
Latest News