|
|
by Suryaa Desk | Fri, Feb 13, 2026, 12:09 PM
సంతాన ప్రాప్తిరస్తు ఫేమ్ విక్రాంత్ హీరోగా నటిస్తున్న 'మార్కండేయ' చిత్రం గ్లింప్స్ తాజాగా విడుదలైంది. వీఎంకే సిస్ట్లా దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో గ్లింప్స్ విడుదల చేశారు. శివుడి ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ చిత్రంలో మంచుకొండల్లో సన్నివేశాలు, హీరోలోకి శివుడి శక్తి ప్రవేశించడం వంటివి ఆసక్తికరంగా ఉన్నాయి.హీరో విక్రాంత్ మాట్లాడుతూ – హాలీవుడ్ లో మల్టీవెర్స్, సూపర్ హీరో మూవీస్ గత కొన్నేళ్లుగా విరివిగా వస్తున్నాయి. కానీ మన పురాణాల్లో వేల ఏళ్ల నుంచే అనంత కోటి బ్రహ్మాండాలు, చిరంజీవులు వంటి కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇతిహాసాల నుంచి తీసుకున్న అలాంటి ఒక కథకు ఆధునిక రూపమే మా మూవీ. ఇతిహాసాల నుంచి తీసుకున్న కథతో మేము చేస్తున్న ఒక మిస్టిక్ థ్రిల్లర్ మూవీ మార్కండేయ. ఈ మూవీ కోసం ఒక యంగ్ టీమ్ ను తీసుకుని ప్లాన్ చేశాం. అయితే ఇలాంటి మూవీకి ఒక గైడెన్స్ సపోర్ట్ కావాలి. యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేసేందుకు దిల్ రాజు గారు దిల్ రాజు డ్రీమ్స్ అనే ప్లాట్ ఫామ్ క్రియేట్ చేశారు. మేము మా కథ ఆయనకు చెప్పి, చేసిన కంటెంట్ చూపించాం. దిల్ రాజు గారికి నచ్చి మా సినిమాను దిల్ రాజు డ్రీమ్స్ బ్యానర్ లో ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకొచ్చారు. సినిమా స్క్రిప్ట్ ఎలా ఉండాలి, బడ్జెట్ కంట్రోల్ ఎలా చేయాలి, మూవీని ఎలా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాలి లాంటి ప్రతి విషయంలో దిల్ రాజు గారు మమ్మల్ని ముందుండి నడిపిస్తున్నారు. ఆయన అంచనాలకు తగినట్లు సినిమా ఇచ్చేందుకు కష్టపడుతున్నాం. సీజీ ఎక్కువగా ఉండే చిత్రమిది. నెక్ట్స్ మరింత మంచి కంటెంట్ ను మీ ముందుకు తీసుకొస్తాం. దిల్ రాజు డ్రీమ్స్ బ్యానర్ లో ఫస్ట్ మూవీ కాబట్టి గుర్తుండిపోయేలా ఉండేలా ఈ సినిమాను అందిస్తాం. మార్కండేయుడి పాత్రకు మోడరన్ వెర్షన్ ఈ మూవీ. మార్కండేయుడికి ఎలాంటి కష్టాలు, ఇబ్బందులు వస్తాయో అలాగే ఈ మార్కండేయుడికి వస్తాయి. ఆ పరమశివుడి దయతో ఆ సమస్యకు సమాధానాలు వెతికి ఆ చిక్కుల్లోంచి ఎలా బయటపడ్డాడు అనేది మూవీలో చూపిస్తున్నాం. ఈ చిత్రంలో సాంకేతికత కంటే హ్యూమన్ ఎమోషన్స్ కే మేము ప్రాధాన్యత ఇస్తున్నాం. అన్నారు.
Latest News