|
|
by Suryaa Desk | Wed, Nov 22, 2023, 01:53 PM
వైష్ణవ్‌తేజ్ నటించిన మాస్ ఎంటర్‌టైనర్ ‘ఆదికేశవ’ ఈ నెల 24న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం మీడియాతో ముచ్చటిస్తూ చిత్రవిశేషాలు వెల్లడించారు వైష్ణవ్‌తేజ్-‘రంగరంగ వైభవంగా’ చిత్రీకరణ చివరి దశలో ఉన్నప్పుడు నిర్మాత నాగవంశీ ఈ కథ వినమని చెప్పారు. కథ నాకు బాగా నచ్చేసింది. నాకు తెలిసిందల్లా కష్టపడి నిజాయతీగా పని చేయడం. ఫలితం గురించి ఆలోచించి చేయను. మొదటి సినిమా ‘ఉప్పెన’ కూడా అలాగే చేశాను. ఎవరు అడిగినా నేను నటుడిని అని చెబుతానే తప్ప హీరో అని చెప్నను. నేను చేసే కథల్లో కొత్తదనం ఉండాలి. అలాగే పాత్రలో కొంచెం కమర్షియాలిటీ ఉండేలా చూసుకుంటాను. అవన్నీ ఈ సినిమాలో ఉన్నాయి అని తెలిపారు.
Latest News