|
|
by Suryaa Desk | Wed, Nov 22, 2023, 01:54 PM
రణ్‌బీర్ కపూర్ కథానాయకుడిగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ సినిమా 'యానిమల్' ట్రైలర్ ఎప్పుడు విడుదల చేయబోతున్నారో అధికారికంగా ప్రకటించారు. దర్శకుడు సందీప్ రెడ్డి, రణబీర్ కపూర్ తో వున్న ఒక ఫోటోని షేర్ చేస్తూ ఈ ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించారు. ఈ సినిమా ట్రైలర్ నవంబర్ 23న విడుదల అవుతుంది అని ఆ పోస్ట్ లో ప్రకటించాడు దర్శకుడు. సందీప్ షేర్ చేసిన ఈ ఫోటోలో రణబీర్ కపూర్ చాలా వైవిధ్యంగా కనిపిస్తున్నారు. అతని పాత్రలో చాలా ప్రతిభతో కూడి ఉంటుంది అని ఈ ఫోటో చూస్తే అర్థం అవుతోంది. రష్మిక మందన్న ఇందులో కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా ఒక్క హిందీలోనే కాకుండా, తెలుగు, తమిళ భాషల్లో కూడా విడుదలవుతోంది. ఈమధ్యనే రణబీర్ కపూర్ హైదరాబాదు వచ్చి నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న 'అన్ స్టాపబుల్' షోలో కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. చిత్ర నిర్వాహకులు ఈ సినిమా నుండి కొన్ని పాటలు, టీజర్ విడుదల చేశారు, అవన్నీ వైరల్ అయ్యాయి. 'యానిమల్'లో రణ్‌బీర్ కపూర్ కి ప్రతినాయకుడిగా బాబీ డియోల్ నటిస్తున్నాడు. ఇంకా అనిల్ కపూర్, త్రిప్తి డిమ్రీ కూడా ఇందులో నటిస్తున్నారు. డిసెంబర్ 1న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.
Latest News