|
|
by Suryaa Desk | Wed, Nov 22, 2023, 01:55 PM
నాని కథానాయకుడిగా నటించిన ‘హాయ్..నాన్న’ డిసెంబరు 7న పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతోంది. ఈలోగా ప్రచార కార్యక్రమాలు కూడా ముమ్మరం చేశారు. ఈనెల 24న ట్రైలర్ ఆవిష్కరించనున్నారు. ‘‘రెండున్నర గంటల కథని రెండున్నర నిమిషాల ట్రైలర్‌గా కట్ చేశాం’’ అని చెబుతున్నారు నాని. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి శౌర్యువ్ దర్శకుడు. మోహన్ చెరుకూరి, విజయేందర్ రెడ్డి తీగల నిర్మాతలు. హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతాన్ని అందించారు. ఇప్పటి వరకూ విడుదల చేసిన పాటలకు మంచి స్పందన వస్తోంది. ‘‘భావోద్వేగాల ప్రయాణం ఇది. నాని సినిమా నుంచి ఆశించే అన్ని అంశాలూ ఈ చిత్రంలో ఉన్నాయ’’ని దర్శక నిర్మాతలు తెలిపారు.
Latest News