|
|
by Suryaa Desk | Wed, Nov 22, 2023, 01:57 PM
హీరోయిన సీరత్ కపూర్ - అల్లు అర్జున్ ల ఫొటో ఒకటి ఇటీవల వైరల్ అయిన సంగతి తెలిసిందే! దాంతో బన్నీ సినిమాలో సీరత కపూర్ ఛాన్స్ కొట్టేసిందనే వార్తలూ వచ్చాయి. దీనికి మరింత బలాన్నిచ్చేలా అల్లు అర్జున్ గురించి సీరత్ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా సీరత్ ఇచ్చిన ఇంటర్వ్యూలో బన్నీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘బన్నీ నాకు వ్యక్తిగతంగా తెలుసు. తెరపై ఆయన ఎనర్జీ అందరం చూశాం. కానీ, అతడి గురించి పర్సనల్‌గా తెలుసుకునే అవకాశం కొందరికి మాత్రమే వస్తుంది. అంత పెద్ద స్టార్ అయినా.. ఎంతో వినయం, వినమ్రలతో ఉంటాడు. తనతో ఉంటే సొంత మనిషితో ఉన్నట్లు ఉంటుంది. కొందరి అలవాట్లు నన్నెంతో ఆకర్షిస్తాయి. ఆ కేటగిరీలో అల్లు అర్జున్ ఒకరు. తనలో ఓ స్పార్క్ ఉంటుంది. నేను తనతో కలిసి పనిచేేస రోజు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అంటూ అల్లు అర్జున్ పై పొగడ్తల వర్షం కురిపించింది. అయితే పుష్ప-2లో ఓ ప్రత్యేక గీతంలో సీరత కపూర్ కనిపించనుందనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే! అందులో ఎంత నిజం ఉందనేది తెలియాలంటే చిత్ర బృందం స్పందించాల్సిందే! ‘రన్ రాజా రన్’తో తెలుగు పరిశ్రమకు పరిచయమైన సీరత్.. ‘టైగర్’, ‘రాజు గారి గది2’లాంటి సినిమాలతో అలరించింది.
Latest News