|
|
by Suryaa Desk | Wed, Nov 22, 2023, 01:59 PM
తాను అర్బన్ టైప్ చిత్రాలను మాత్రమే తెరకెక్కించాలని అనేక మంది ప్రేక్షకులకు ఆశగా ఉందని, తనకు మాత్రం గ్రామీణ నేపథ్యంతో సినిమాలను తెరకెక్కించాలని ఉందని ప్రముఖ సినీ దర్శకుడు గౌతం వాసుదేవ్ మీనన్ అన్నారు. ఆయన దర్శకత్వంలో చియాన్ విక్రమ్ నటించిన తాజా చిత్రం ‘ధృవనక్షత్రం’ . రీతూ వర్మ హీరోయిన్. ఈ సినిమా ఈ నెల 24న విడుదలకాబోతోంది. యాక్షన్ స్పై జోనర్‌లో రూపొందించారు. ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే.. ఈ మూవీ అతి ముఖ్యమైన మిషన్ నేపథ్యంలో సాగుతున్నట్టు తెలుసుకోవచ్చు. ఐశ్వర్యా రాజేష్, సిమ్రాన్, రాధిక కీలక పాత్రలను పోషించారు. ఈ సినిమా వివరాలను తాజాగా చెన్నైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు వివరించారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన అనేక ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు. గ్రామీణ నేపథ్యంలో కూడిన చిత్రాలను తెరకెక్కించే విషయంపై స్పందిస్తూ.. శింబు హీరోగా నిర్మించిన ‘వెందు తణిందదు కాడు’ చిత్రంలో ప్రారంభ సన్నివేశాల్లో గ్రామీణ సీన్లు ఉంటాయి. ఈ సినిమా చూసిన అనేక మంది ఎందుకు అలాంటి సినిమాలు తీస్తున్నారంటూ ప్రశ్నించారు. ఆ తర్వాత నేను కూడా ఆలోచించాను. ఆ సన్నివేశాలు ఆ చిత్రానికి కాస్త మైనస్‌గా మారాయి. నేను అర్బన్ టైప్ చిత్రాలను తీయాలన్నది ప్రేక్షకుల కోరిక. కానీ, నాకు మాత్రం గ్రామీణ నేపథ్యంలో సినిమా తీయాలని ఉందని చెప్పారు.
Latest News