|
|
by Suryaa Desk | Wed, Nov 22, 2023, 01:59 PM
‘రానా నాయుడు 2’ గురించి వెంకటేష్ మాట్లాడుతూ... ‘‘నాగా నాయుడు’ మామూలోడు కాదు. ‘నెట్‌ఫ్లిక్స్’ సంస్థ తీసుకొచ్చిన ఆ సిరీస్‌ను ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది చూశారు. పెద్దవాళ్లేమో ‘ఏంటి.. నువ్వు అలా చేశావ్?’ అన్నారు. కానీ, మీ కుర్రాళ్లంతా సీక్వెల్ అడుగుతున్నారు. అందుకే ఎవరికీ ఇబ్బంది లేకుండా ఈసారి జాగ్రత్తగా ఉంటా. వచ్చే ఏడాది జనవరి నుంచి చిత్రీకరణలో పాల్గొంటా’’ అని వెంకటేష్ చెప్పారు. అంతే కాదు టీమిండియాను వన్డే ప్రపంచకప్‌లో బాగా ఆడిందని, దాదాపు 60 రోజులు అందరినీ అలరించినందుకు వారికి థ్యాంక్స్ చెప్పాలి. మన టీమ్‌ను చూసి గర్వపడుతున్నానని, రాబోయే వరల్డ్‌కప్‌లో తప్పక విజయం సాధిస్తుందని వెంకటేష్ అన్నారు.
Latest News