|
|
by Suryaa Desk | Wed, Nov 22, 2023, 05:05 PM
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఇటీవలి విడుదలైన 'జవాన్' తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. తాజాగా ఇప్పుడు, రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తన రాబోయే సినిమా 'డుంకీ' తో మరోసారి ప్రేక్షకులను ఆకర్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సినిమా నుండి ప్రీతమ్ స్వరపరిచి, అరిజిత్ సింగ్ పడిన ఈ సినిమాలోని మొదటి సింగిల్ ని 'లుట్ పుట్ గయా' అనే టైటిల్ తో మూవీ మేకర్స్ విడుదల చేసారు. ఈ ప్రేమ పాట అందమైన సాహిత్యాన్ని కలిగి ఉంది.
డుంకీలో తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనిల్ గ్రోవర్ మరియు బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటించారు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, రాజ్‌కుమార్ హిరానీ ఫిలింస్ మరియు జియో స్టూడియోస్ బ్యానర్‌లపై గౌరీ ఖాన్ మరియు రాజ్‌కుమార్ హిరానీ ఈ సినిమాని నిర్మించారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా డిసెంబర్ 21, 2023న గ్రాండ్ రిలీజ్ కానుంది.