|
|
by Suryaa Desk | Wed, Nov 22, 2023, 05:52 PM
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తదుపరి సినిమాని యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకతంలో చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ యాక్షన్-అడ్వెంచర్ చిత్రానికి 'OG' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ పెట్టారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్న ఈ స్టార్ యాక్టర్ టైగర్ 3ని ప రమోట్ చేస్తున్నప్పుడు OG గురించి ఓపెన్ అయ్యారు.
ఇమ్రాన్ హష్మీ మాట్లాడుతూ, OG అనేది ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ మరియు పాన్ ఇండియన్ చిత్రం. తెలుగు ప్రేక్షకులకు నేనెవరో తెలిసి ఉండవచ్చు కానీ, నా సినిమాలను చూసి ఉండరు. నా పనితనాన్ని ప్రదర్శించడం ద్వారా వారికి మరింత దగ్గరవ్వాలనుకుంటున్నాను. నేను పోషిస్తున్న పాత్ర చాల బాగుంటుంది అని వెల్లడించారు.
ఈ పాన్-ఇండియన్ ప్రాజెక్ట్‌లో ప్రియాంక అరుల్ మోహన్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాలో కోలీవుడ్ బ్యూటీ శ్రీయ రెడ్డి, అర్జున్ దాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ బిగ్గీకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాని డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తుంది.
Latest News