|
|
by Suryaa Desk | Wed, Dec 06, 2023, 01:08 PM
మంచి పాలన అందిస్తాననే నమ్మకంతో తనను నియోజకవర్గ ప్రజలు మరోసారి గెలిపించారని, వారందరికీ రుణపడి ఉంటానని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన సబితా ఇంద్రారెడ్డి బుధవారం ఆర్కేపురం డివిజన్లో పర్యటించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆమె మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుంచి మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు.
మహేశ్వరం నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలుపుపొందిన సబితారెడ్డి బుధవారం ఆర్కేపురంలో కుర్తాళం పీఠం ప్రత్యంగిరా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మ వారు మహిమ గల దేవతని, దేశం నలుమూలల నుంచి భక్తులు దర్శించుకుంటారని ఎమ్మెల్యే అన్నారు. ఈ సందర్భంగా ఆలయ సెక్రటరీ మునిపల్లి శ్రీనివాస్, సువర్ణలత దంపతులు సబితారెడ్డికి అమ్మవారి జ్ఞాపికను అందజేశారు.