|
|
by Suryaa Desk | Wed, Dec 06, 2023, 01:39 PM
లాభాల పేరుతో పెట్టుబడి పెట్టి నగదు పోగొట్టుకున్న బాధితుడు బుధవారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశారు. నగరానికి చెందిన ఓ వ్యక్తికి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని ఫోన్ కు మెసేజ్ వచ్చింది. దీంతో అతడు అవతలి వ్యక్తికి ఫోన్ చేయగా తక్కువ పెట్టుబడులు పెడితే లాభాలు ఇస్తామన్నాడు. బాధితుడు నమ్మి విడతల వారీగా రూ. 15. 89 లక్షలు పెట్టుబడి పెట్టాడు. తర్వాత మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు.