by Suryaa Desk | Sat, Jul 13, 2024, 01:10 PM
కల్లూరు మండలంలోని ఓ గ్రామంలో మహిళ అదృశ్యంపై స్థానిక పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని ఓ గ్రామంలో ఈ నెల 10న ఉదయం 9 గంటల సమయంలో సదరు మహిళ సెంటర్కు వెళ్లి వస్తానని వెళ్లి ఇంత వరకు తిరిగి రాలేదు. దీంతో బాధిత మహిళ అన్నయ్య ఫిర్యాదుతో ఎస్ఐ ఎస్కే షాకీర్ మహిళ అదృశ్యంగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.