by Suryaa Desk | Sat, Aug 10, 2024, 09:59 PM
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతుబంధు ఎకరానికి రూ.5వేలు వస్తుండేదని.. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రూ.7500 ఇస్తామని గొప్పలు చెప్పిందని.. అధికారంలోకి వచ్చాక ఆ ముచ్చట లేదని.. ఇచ్చే రూ.5వేల ఊసెత్తడం లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో 217 మందికి రూ.49.91లక్షల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు.ప్రజలకు ఏ కష్టం వచ్చిన ఎల్లప్పుడూ మీ సేవలో ఉంటానన్నారు. కాంగ్రెస్ ఎగవేత, కోతల ప్రభుత్వమని విమర్శించారు. పెన్షన్లు, రైతుబంధు, కల్యాణలక్ష్మిలో రూ.లక్షతో పాటు తులం బంగారం మాటలకే పరిమితమైందన్నారు.అబద్ధాలు, మోసం మాటలతో అధికారంలోకి వచ్చి ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని విమర్శించారు. ఆగస్టు నెల సగం అయినా రైతుబంధు లేదన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు జూన్‌లోనే రైతుబంధు పడిందని.. ఫోన్లు టింగ్ టింగ్‌మని మోగాయన్నారు.కేసీఆర్ కంటే కంటే ఎక్కువ ఇస్తా అని అబద్ధాలు చెప్పి అధికారం లోకి వచ్చి మోసం చేసిండ్రని హరీశ్‌రావు ధ్వజమెత్తారు