by Suryaa Desk | Thu, Sep 26, 2024, 03:36 PM
పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా బుధవారం వినాయకనగర్ డివిజన్ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి దీన్ దయాళ్ నగర్ లోని వారి విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతు..
భారత రాజకీయాల్లో దీన్ దయాళ్ ఉపాధ్యాయ కొత్త ఒరవడిని సృష్టించారని గుర్తుచేసారు. స్వాతంత్య్రం వచ్చిన వెంటనే మొదట రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్... ఆ తర్వాత భారతీయ జనసంఘ్ ద్వారా రాజకీయా రంగ ప్రవేశం చేసిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను మార్చేసారని అన్నారు.
ఆయన అందించిన ఆలోచనలు నేడు భారతదేశానికే కాకుండా ప్రపంచ సమాజానికి కూడా మార్గనిర్దేశం చేసాయని పేర్కొన్నారు. ఆయన భవిష్యత్ తరాలకు ఆయన ఓ దిక్సూచి అని ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు, పార్టీ నాయకులు, కార్య కర్తలు, తదితరులు పాల్గొన్నారు.