by Suryaa Desk | Fri, Sep 27, 2024, 02:28 PM
మహబూబాబాద్ జిల్లా, మండల కేంద్రం పరిధిలో, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ మురళీధర్ ఆదేశానుసారం. గూడూరు మండలం పరిధిలో 29 గ్రామ పంచాయతీలకు సంబంధించిన సిబ్బంది అందరికి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అయోధ్యాపురం వైద్య అధికారి డాక్టర్ యమున ఆద్వర్యంలో, వైద్య శిబిరాలు గూడూరు, భూపతిపెట, మచ్చర్ల లలో పారిశుధ్య కార్మికులు 74 మందికి, ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.
బిపి షుగర్ పరీక్షలు చేసి, ఉచితంగా మందులు పంపిణీ చేసి చికిత్సలు అందించారు. ప్రతి ఒక్కరు తప్పకుండా వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు, శానిటేషన్ పనులు చేసేటప్పుడు మొఖానికి మాస్కులు, చేతికి గ్లౌజులు, కాలికి పొడుగు బూట్లు వేసుకొని పనులు చేయవలెనన్నారు. పారిశుధ్య కార్మికులుకు చెప్పారు. ఇట్టి కార్య క్రమంలో డాక్టర్ దేవేందర్, డాక్టర్ ప్రతిభ, డాక్టర్ నరేష్ కుమర్, ఎంపీడీవో ఎర్ర వీరాస్వామి,ఎంపీవో అడ్లగట్ల సత్యనారాయణ, హెచ్ ఈ ఓ. లోక్యా నాయక్, హెచ్ ఎస్ గణేష్, ఎమ్ ఎల్ హెచ్ పి ఎస్. గోపీ, రాజకుమార్, విశాల, ప్రశాంత్, ఏ ఎన్ ఎం లు, ఆశలు పాల్గొన్నారు.