by Suryaa Desk | Fri, Sep 27, 2024, 02:34 PM
మూసీ ప్రక్షాళనలో భాగంగా పరిపరివాహక ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు సర్వేను వేగవంతం చేశారు. బఫర్ జోన్, మూసీ రివర్ బెడ్ పరిధిలోని ఆక్రమ నిర్మాణాలను గుర్తించి మార్కింగ్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో చైతన్య పురి వినాయక్ నగర్ లో మూసీ సర్వే కు వచ్చిన అధికారులను స్థానికులు అడ్డగించారు. మా ఇండ్లు కూల్చొద్దని వేడుకున్నారు. మాకు అన్ని రకాల రిజిస్ట్రేషన్ ఉన్నాయి. కరెంట్, వాటర్ సప్లయ్ ఉన్నాయి.ఇప్పుడు ఎందుకు వచ్చారు అంటూ అధికారులను స్థానికులు నిలదీశారు. అయినా అధికారులు సర్వేను ఆపలేదు. దీంతో కార్పొరేటర్ లు, ఓ యువకుడు పెట్రోలో పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్డడ్డాడు. ఈ ఘటనతో చైతన్య పురిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.