by Suryaa Desk | Sat, Nov 09, 2024, 12:15 PM
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో కుల గణన సర్వే చేయడానికి సర్వ సిద్ధం చేశారు. ఈ క్రమంలో శనివారం ఉదయం కుల గణన సర్వే పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎస్ శాంతి కుమారి(, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ.. కలెక్టర్లు, ఎన్యుమరేటర్స్తో విస్తృతంగా మాట్లాడాలని.. సర్వే చేస్తున్న ప్రాంతాల్లోని లోకల్ మంత్రులు, ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలో జరగుతున్న ఈ కులగణన కారణంగా దేశం మొత్తం తెలంగాణను గమనిస్తుంది డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. కాగా ఈ నెల 6 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభించారు. ఇందులో భాగంగా మొదటి మూడు రోజులు స్టిక్కర్లు అంటించారు. కాగా నేటి నుంచి కుటుంబాల వివరాలు సేకరించనున్నారు.