by Suryaa Desk | Sun, Nov 10, 2024, 06:47 PM
విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సీనియర్ సివిల్ కోర్ట్ జడ్జి నాగేశ్వరరావు సూచించారు. జాతీయ లీగల్ సర్వీసెస్ దినోత్సవం సందర్భంగా మెట్ పల్లి పట్టణంలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో శనివారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని.
చట్టాలపై పూర్తిస్థాయి అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రతి మనిషికి నిజ జీవితంలో చట్టాల ఉపయోగం ఎంతో ఉంటుందని పేర్కొన్నారు. మైనర్ విద్యార్థులు వాహనాలు నడిపి చట్టాలను ఉల్లంగిస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి అరుణ్ కుమార్, పాఠశాల ప్రిన్సిపాల్ తిరుపతి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు పుప్పాల లింబాద్రి, కార్యదర్శి వేణుగోపాల్, సీనియర్ న్యాయవాదులు వెంకట నర్సయ్య, ఆనంద్ గౌడ్, వడ్డేపల్లి శ్రీనివాస్, గడ్డం శంకర్ రెడ్డి, ఒజ్జెల శ్రీనివాస్, నల్ల రాజేందర్, శేఖర్, రాజేశ్వర్ గౌడ్, సురక్ష తదితరులు పాల్గొన్నారు.