by Suryaa Desk | Sun, Nov 10, 2024, 06:07 PM
ఆత్మకూరు మండలంలోని పెంచికల్ పేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మందపెల్లి ప్రసాద్ తండ్రి మందపెల్లి రాజమల్లు ఇటీవల మృతి చెందగా విషయం తెలుసుకున్న రాష్ట్ర యువజన నాయకులు రేవూరి రణధీర్ రెడ్డి మృతుడు రాజమల్లు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి, మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు.ఈ సందర్భంగా రణధీర్ రెడ్డి మాట్లాడుతూ మృతుని కుటుంబానికి తన వంతు సహాయంగా ఉంటానని అన్నారు.
ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు రేవూరి రణధీర్ రెడ్డి వెంట స్థానిక కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు లింగయ్య,కాంగ్రెస్ మండల పార్టీ ఉపాధ్యక్షులు కుండే కృష్ణంరాజు, వెన్నపురెడ్డి నాగరాజు, మండల పార్టీ యూత్ కార్యదర్శి మంగరాజు, అసెంబ్లీ యూత్ కార్యదర్శి కొమ్ముల శ్రావణ్, మందపెల్లి సుధాకర్,ముదిగిరి లింగయ్య, ఉప్పునూతల శ్రీనివాస్,యూత్ నాయకులు గోవింద్ అఖిల్,దురిశెట్టి శ్రవణ్, మంగ నితిన్, కొలగాని రాజు, గ్రామ కాంగ్రెస్ నాయకులు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.