by Suryaa Desk | Sun, Nov 10, 2024, 06:09 PM
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డి.వి శ్రీనివాస రావు ఐపీఎస్, జిల్లా అదనపు ఎస్పి ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు అక్రమంగా తరలిస్తున్న దేశదారును కౌటాల పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్రలో గడిచిరోలి జిల్లాలో మద్యపాన నిషేధం కలదు అలాగే చంద్రపూర్ జిల్లాలో మద్యపానం నిషేధం లేదు అందువలన మహారాష్ట్రలో ఎలక్షన్ కోడ్ నడుస్తున్నందున, మన రాష్ట్రానికి చెందిన చింతలమానెపల్లి మండలం గూడెం గ్రామనివాసి పర్వతాల ప్రవీణ్ s/o సత్తయ్య, వయసు 29 సంవత్సరాలు, తుమ్మిడిహెట్టి గ్రామానికి చెందిన ఒడిల ప్రకాష్ s/o సాంబన్న, వయసు 30 సంవత్సరాలు మరియు గూడెం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ అగాడి కొండయ్య s/o రంగయ్య అను వ్యక్తులు చంద్రపూర్ జిల్లా, బంగారీ తర్విడి కి వెళ్లి అక్కడ దేశిదారు మద్యం కొనుగోలు చేసుకుని రోడ్డు మార్గానా వస్తే పోలీసు చెక్ పోస్ట్ లు ఉన్నాయని అట్టి మద్యంను పడవ సహాయంతో నది మార్గాన తుమ్మిడి హెట్టి గ్రామం కు తరలించి అక్కడి నుండి ఆటో ద్వారా గూడెం బ్రిడ్జి మార్గంలో గడ్చిరోలి జిల్లాలో అహేరి కి తీసుకువెళ్లి అధిక ధరలకు అమ్ముకొని లాభాలను సమానంగా పంచుకోవాలని దురుద్దేశంతో తీసుకొని వెళుతుండగా తుమ్మిడి హెట్టి పరిసర ప్రాంతంలో కౌటల ఎస్ఐ మధుకర్ మరియు సిబ్బంది పట్టుకున్నారు. వారి వద్ద నుండి ఒక ఆటో టీ.యస్ 01 యూబి 1406 మరియు 20 పెట్టెలా దేశదారు మద్యం దీని విలువ Rs.1,80,000 ఉంటుంది. వీటిని కౌటల ఎస్ఐ మధుకర్ మరియు సిబ్బంది వారు స్వాధీన పరుచుకొని కేసు నమోదు చేయనైనది. ఈ కార్యక్రమంలో సిఐ ముత్యం రమేష్, ఎస్ఐ మధుకర్, మరియు సిబ్బంది పాల్గొన్నారు.