by Suryaa Desk | Sat, Nov 09, 2024, 01:11 PM
నేటి యువత చదువుతో పాటు క్రీడలలోనూ రాణించి దినదినాభివృద్ధి చెందాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. కొంపల్లి మున్సిపాలిటీ పరిధి దూలపల్లిలోని ఇగ్నైట్ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన "కేలో ఇగ్నైట్ స్పోర్ట్స్ మీట్" ను ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి యువత చదువులతో పాటు క్రీడల్లో సత్తా చాటుతూ ప్రపంచంతో పోటీ పడాలని అన్నారు. గత ఐదేళ్ల క్రితం 150 మందితో ప్రారంభమైన ఇగ్నెట్ ఐఏఎస్ అకాడమీ నేడు 500 మంది విద్యార్థులతో మంచి విద్యను అందిస్తూ ఎందరో విద్యార్థులను ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా తీర్చిదిద్దడంలో విశేషంగా కృషిచేస్తున్న ఇగ్నైట్ ఐఏఎస్ అకాడమీ సంస్థకు అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, వైస్ చైర్మన్ గంగయ్య నాయక్, కౌన్సిలర్లు పూజారి వసంత లక్ష్మణ్, డప్పు కిరణ్, ఆప్షన్ సభ్యులు వెంకటేష్, ఇగ్నైట్ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ సిహెచ్. శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్ ఎన్.ఎస్.రెడ్డి, సివిల్స్ డీన్ ఎన్. అనుష్ రెడ్ది, డైరెక్టర్ వి. పవన్ కుమార్, ప్రిన్సిపల్ ఎం. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.