by Suryaa Desk | Sat, Nov 09, 2024, 01:19 PM
జగిత్యాల జిల్లా బుగ్గార మండలం విద్యార్థులు సామర్ధ్యాలు తెలుసుకునేందుకు మండలంలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో న్యాస్ నమూనా పరీక్ష శుక్రవారం పకడ్బందీగా నిర్వహించినట్లు మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. మండలంలోని పలు పాఠశాలలను ఆయన సందర్శించి న్యాస్ పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది ప్రభుత్వం జాతీయ సాధన సర్వే(న్యాస్) పరీక్ష నిర్వహిస్తుందని తెలిపారు. ఈ ఏడాది మూడు సార్లు న్యాస్ నమూనా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
ఇప్పటికే రెండు నమూనా పరీక్షలు పూర్తి కాగా శుక్రవారం మండలం లోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో 3, 6, 9 తరగతుల విద్యార్థులకు మూడో నమూనా పరీక్ష నిర్వహించారని తెలిపారు. ఈ పరీక్ష నమూనా గోలాపూర్ గ్రామంలో MEO కూడా పరిశీలన చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సి ఆర్ పి పురుషోత్తం, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.