by Suryaa Desk | Sat, Nov 09, 2024, 01:42 PM
మానకొండూర్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు బయటపడ్డాయి.సీఎం రేవంత్ రెడ్డి జన్మదినోత్సవం సందర్బంగా కార్యకర్తలు శుక్రవారం రెండు వర్గాలుగా వీడి రెండు కేక్ లు కోయడంతో విభేదాలు బయటపడ్డాయి.కాంగ్రెస్ కార్యకర్తల్లో సమన్వయం లేకపోవడంతోనే వర్గవిభేదాలు పోడసూపినట్లు పార్టీ శ్రేణుల్లో చర్చ సాగుతోంది.సీఎం రేవంత్ రెడ్డి బర్త్డే సందర్బంగా మానకొండూర్లోని కరీంనగర్-వరంగల్ ప్రధాన రహదారిపై మండల పార్టీ అధ్యక్షుడు రవి ఆధ్వర్యంలో నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని కేక్ ను కోశారు.అనంతరం రోడ్డుకు అవుతల మానకొండూర్ మండల కేంద్రం నాయకులు సంపత్ ఆధ్వర్యంలో మరో కేక్ ను కోసి పండ్లు పంపిణీ చేసారు.రెండవ కేక్ కోసే ముందు కాంగ్రెస్ నాయకుల మధ్య కొద్దిసేపు వాగ్వివాదం జరిగింది.
మానకొండూర్ మండల కేంద్రం మైనార్టీ నాయకులు తోసేసుకున్నారు.మార్కెట్ కమిటీ చైర్మన్,డిసిసి ప్రధాన కార్యదర్శి,మండల పార్టీ అధ్యక్షుడు,నాయకులు,కార్యకర్తల మధ్య సమన్వయం లోపించిందని స్వంత పార్టీ కార్యకర్తలే చెవులు కొరుక్కుంటున్నారు.మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ ఫోటోను ప్లెక్సీలలో పెట్టడంతోనే విభేదాలు పొడసూపినట్లు కార్యకర్తల ద్వారా తెలిసింది.పార్టీలో వర్గ విభేదాలు ఎం లేవని,రెండవ కేక్ మానకొండూర్ మైనారిటీ ఆధ్వర్యంలో కోశారని ఓ నాయకుడు,మానకొండూర్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో కోశారని మరో నాయకుడు సమర్దించుకోవడం గమనార్హం.