by Suryaa Desk | Sat, Nov 09, 2024, 02:01 PM
మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐపీఎస్. శుక్రవారం రోజున గూడూరు పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ కి, గూడూరు సిఐ, కె. బాబురావు స్వాగతం పలికి, పుష్పగుచ్చం అందించారు. అనంతరం ఎస్పీ సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించి, వారికి సంబంధించిన కిట్, ఆర్టికల్స్, తనిఖీ చేయడం చేశారు. స్టేషన్ ఆవరణలో మొక్కను నాటిన ఎస్పీ , తర్వాత స్టేషన్ కు సంబంధించిన వాహనాలు, ఆయుధాల యొక్క పనితీరును పరిశీలించారు. పోలీస్ స్టేషన్ కు సంబంధించి వర్టికల్ వారిగా, సిబ్బంది యొక్క పనితీరుకు సంబంధించి రివ్యూ చేసిన ఎస్పీ. సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ లో కేసులకు సంబంధించిన ఫైల్స్, రికార్డులను తనిఖీ చేసి, పోలీస్ స్టేషన్ పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ, పోలీస్ ఇమేజ్ ను పెంచే విధంగా పనిచేయాలన్నారు. అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్న సైబర్ నేరాల పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, యువత గంజాయి, డ్రగ్స్ వంటి చెడు అలవాట్లకు ఆకర్షితులు కాకుండా, చూడవలసిన బాధ్యత పోలీసుల పై ఉందన్నారు. తదానంతరం సిబ్బందితో సమావేశమై, వారి యోగక్షేమాలు, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ ఉద్యోగం ఎంతో బాధ్యతతో కూడుకున్నదని, పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల సహృదయంతో, మర్యాదగా ప్రవర్తించాలన్నారు. ఫిర్యాదుదార్ల సమస్యలను పరిష్కరించడంలో ఎటువంటి జాప్యం లేకుండా చూడాలన్నారు.
పోలీస్ స్టేషన్ ఆవరణలో క్రీడా ప్రాంగణం ను ప్రారంభించిన ఎస్పీ
24*7 పనిచేస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే పోలీసులపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుందని, దీనికి గాను వారికి కాస్తంత మానసిక ఉల్లాసం కలిగించేందుకు క్రీడలు ఎంతో ఉపయోగపడతాయి. అనే ఉద్దేశంతో స్టేషన్ ఆవరణలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేశారు. ఎస్పీ చేతుల మీదుగా పోలీస్ స్టేషన్ క్రీడా ప్రాంగణంలో, ఏర్పాటు చేసిన వాలీబాల్ కోర్ట్, షటిల్ కోర్ట్, క్రికెట్, నెట్ ప్రాక్టీస్ సంబంధించిన శిలాఫలకము ను ఆవిష్కరించారు. ఎస్పీ క్రీడా ప్రాంగణం ప్రారంభోత్సవం సందర్భంగా, మొదటగా వాలీబాల్ కోర్టు ప్రారంబించి, సర్వీస్ చేసి, యువత తో వాలీబాల్ మ్యాచ్ ఆడుతూ అద్భుతమైన షార్ట్ లను ఆడారు. పదానంతరం బాల్ బాడ్మింటన్ కోర్ట్ ప్రారంభించి, బ్యాట్ పట్టి షార్ట్స్ తో అలరించారు. క్రికెట్ నెట్ ప్రాక్టీస్ కోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా, బ్యాటింగ్ చేస్తూ తనలో ఉన్న అద్భుతమైన క్రీడా ప్రదర్శన బయటపెట్టారు. అద్భుతమైన షాట్లు ఆడుతూ ప్రొఫెషనల్ క్రీడాకారున్ని గుర్తు చేశారు. క్రీడల పట్ల తనకున్న మక్కువను తెలియజేసిన ఎస్పీ. అధికారులు, సిబ్బంది క్రీడా ప్రాంగణాన్ని ఉపయోగించుకుని ఉల్లాసంతో పాటు, ఫిట్నెస్ పెంపొందించుకోవాలని సూచించారు.