by Suryaa Desk | Sat, Nov 09, 2024, 02:07 PM
మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యందు సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాన్ని ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించిన మహబూబాబాద్ ఎమ్మెల్యే డా.భూక్యా మురళీ నాయక్ గారు మరియు డిసిసి అధ్యక్షులు భరత్ చందర్ రెడ్డి గారు.
మార్కేట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై, పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మహబూబాబాద్ ఎమ్మెల్యే డా భూక్యా మురళీ నాయక్ గారు.అనంతరం ఎమ్మెల్యే గారిని మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు డైరెక్టర్లు శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రైతులకు తేమ విషయంలో అధికారులు సహకరించాలని అన్నారు. అలాగే రైతులు కొనుగోలు కేంద్రానికి తేమ తక్కువ ఉండి,చెత్తా చెదారం లేని నాణ్యతగల పత్తిని తీసుకువచ్చి మద్దతు ధర పొందాలన్నారు.
రైతులు దళారులకు పత్తిని విక్రయించి మోసపోవద్దని తెలిపారు
ఈ త్వరలోనే రైతు భరోసా 7500 రూపాయలు ఇస్తామన్నారు.ఈ నెలాఖరులోగా రూ 2 లక్షల లోపు ఉన్న రైతులకు రుణమాఫీ పూర్తి చేస్తామని తెలిపారు.వచ్చే నెల నుంచి రూ.2 లక్షల పైబడి ఉన్నవారికి మాఫీ చేస్తామని పేర్కొన్నారు.మరో వైపు టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిందని విమర్శించారు.వరంగల్ డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం దేశంలో ఏ రాష్ట్రం చెయ్యని విధంగా మూడు దఫాలుగా రైతులకు సుమారు లక్ష రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత మన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుంది.ప్రతిపక్షాలు అవాక్కులు చేవాక్కులు పేలుతూ రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు దీనిని రాష్ట్ర ప్రజానికం చూస్తున్నారు ప్రజలు రెండు సార్లు కర్రు కాల్చి వాత పెట్టిన కూడా బుద్ధి లేకుండా ఫామ్ హౌస్ లో కూర్చొని రాజకీయాలు చేస్తూ ప్రజలను మభ్య పెడుతన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో కూర్చొని విమర్శలు చేస్తూ సోషల్ మీడియా వేదికల ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారు కానీ మన ప్రజా ప్రభుత్వం లో మన సిఎం రేవంత్ రెడ్డి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలకు ఎల్లప్పుడూ అందుబాటు ఉంటూ ప్రజా సమస్యల మీద సమయం కల్పిస్తూ వాటిని పరిష్కరిస్తున్న ఏకైక సీఎం రేవంత్ రెడ్డి గారు.ప్రజల కోసమే ప్రజల వద్దకు ప్రజాపాలన తీసుకువచ్చిన ఒక గొప్ప వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి గారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు, జిల్లా సీనియర్ నాయకులు, మండల అధ్యక్షులు, మాజీ జడ్పిటిసిలు, మాజీ ఎంపిటిసిలు, మాజీ సర్పంచ్లు, వార్డ్ మెంబర్లు, కమిటీ సభ్యులు ,రైతులు ,అధికారులు పాల్గొన్నారు