by Suryaa Desk | Fri, Dec 27, 2024, 08:08 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు మృతి చెందిన ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బోరబండకు చెందిన ఆకాన్ష్, రఘుబాబు అర్ధరాత్రి సమయంలో బోరబండ నుంచి మాదాపూర్ వెళ్తుండగా.. మాదాపూర్ 100 ఫీట్ రోడ్‌లోని పర్వత్ నగర్ చౌరస్తా సమీపంలో బుల్లెట్ బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలిలోనే ఒకరు మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందినట్టు మాదాపూర్ పోలీసులు తెలిపారు. బైక్ నడిపిన యువకుడు మద్యం మత్తులో ఉన్నాడని, అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.