by Suryaa Desk | Fri, Dec 27, 2024, 08:30 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్న ఓ కార్యక్రమంలో 'సీతక్క' పేరు వినిపించింది. ఓ బీసీ సంఘం నేత 'సీతక్క' పేరు పలకడంతో కవిత నవ్వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఎమ్మెల్సీ కవిత బంజారాహిల్స్‌లోని తన నివాసంలో నేడు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 40 బీసీ సంఘాలతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో ఒక్కో నేత మాట్లాడుతున్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఓ సిక్కు సంఘం నేత కూడా మాట్లాడారు. "సభ ఏర్పాటు చేసిన మా సీతక్కకు నమస్కారం" అంటూ ఆ సిక్కు సంఘం నేత ఒకింత తడబాటుకు గురయ్యారు. దీంతో కవిత సహా కార్యక్రమంలోని వారంతా నవ్వేశారు. ఆ వెంటనే పొరపాటును సరిదిద్దుకున్నారు. "సారీ కవితక్క" అంటూ తిరిగి ప్రసంగం కొనసాగించారు.