![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 21, 2025, 01:44 PM
నారాయణపేట పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. పరీక్ష హాలులో పరీక్ష రాస్తున్న విద్యార్థులను పరిశీలించారు. సౌకర్యాలపై అరా తీశారు. అనంతరం సిబ్బందితో మాట్లాడి ఎంతమంది విద్యార్థులు హాజరయ్యారు అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సిబ్బందికి సూచించారు.