![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 02, 2025, 02:55 PM
పేదలకు సమృద్దిగా సన్న బియ్యం రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. బుధవారం పెద్దపల్లి పట్టణంలోని గ్యాస్ గోదాం వద్ద గల సుభాష్ నగర్ లో ప్రభుత్వం చేపట్టిన రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావుతో కలిసి ప్రారంభించారు. అన్ని రేషన్ షాపులలో తెల్లకార్డు దారులకు ఇక నుంచి ప్రతినెల సన్న బియ్యం పంపిణీ జరుగుతుందన్నారు.