![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 02, 2025, 02:53 PM
రానున్న శ్రీరామ నవమి పురస్కరించుకొని గ్రామాలలో గ్రామోత్సవం నిర్వహించాలని భజరంగ్ దళ్ జిల్లా కార్యదర్శి భీమేశ్, విశ్వహిందూ పరిషత్ ప్రఖండ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్ అన్నారు. బుధవారం కృష్ణ మండల కేంద్రంలో సమావేశం నిర్వహించారు. ప్రతి రోజూ ఒక్కో గ్రామంలో గ్రామోత్సవం నిర్వహించాలని చెప్పారు. శ్రీరామ నవమి నాటికి అన్ని గ్రామాల్లో పూర్తి చేయాలని చెప్పారు. శ్రీరామ నవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని అన్నారు.