![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 02, 2025, 02:49 PM
తెలంగాణలో బలహీనవర్గాలకు మద్దతుగా ఆమోదించిన 42 శాతం రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలపాలని సీఎం రేవంత్ ప్రధాని మోదీని కోరారు. బీసీ పోరుగర్జనలో భాగంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన పోరుబాటలో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. చట్టం తమ చేతుల్లో ఉంది కదా అని ఆధిపత్యం చెలాయిస్తే గతంలో నిజాంలకు ఏ గతి పట్టిందో మోదీకు అదే గతి పడుతుందని హెచ్చరించారు. బీసీలపై నిజమైన ప్రేమ ఉంటే రిజర్వేషన్ల పెంపునకు ఆమోదం తెలపాలని సూచించారు.