![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 03, 2025, 10:03 AM
కేంద్రప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడి నూతన చట్టాలను తేవాలని చూస్తుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పురపాలక పరిధిలోని 11వ వార్డు పాత పాలమూరు ప్రాంతంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ. భారతీయ జనతా పార్టీ ప్రజా హక్కులను కాలరాస్తున్న క్రమంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. స్థానిక నాయకులు పాల్గొన్నారు.