![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 03, 2025, 06:20 PM
గర్భస్థ శిశు లింగ నిర్ధారణ నిషేధిత చట్టం 1994 ప్రకారం లింగ నిర్ధారణ చేసి ఆడ, మగ అని చెప్పడం చట్టరీత్యా నేరమని మాత శిశు సంరక్షణ అధికారి డాక్టర్ ఎం. జైపాల్ రెడ్డి పేర్కొన్నారు.
గురువారం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు కోరుట్లలోని స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్స్ కటుకం భూమేశ్వర్, తరాల శంకర్, ఆరోగ్య విస్తీర్ణ అధికారి రాజేశం పాల్గొన్నారు.