![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 04, 2025, 12:54 PM
ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రశ్నించే గొంతుకలంటేనే భయపడుతున్నది. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పుకునే ధైర్యంలేక.. దొంగదారిలో పోలీస్ కేసులు పెట్టిస్తూ భయపెట్టాలని చూస్తున్నది. సోషల్ మీడియా యాక్టివిస్టులపై అడ్డగోలుగా కేసులు పెడుతూ నియంతృత్వంగా వ్యవహరిస్తున్నది. ఇప్పటి వరకు ఈ 15 నెలల కాంగ్రెస్ పాలనలో నిత్యం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిశాంక్‌పై 23 కేసులు, కొణతం దిలీప్‌పై 12 కేసులను నమోదు చేశారు. బీఆర్‌ఎస్ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ దిలీప్, క్రిశాంక్‌పై గచ్చిబౌలి పీఎస్‌లో కేసు నమోదైంది. వీడియోలు ఎడిట్ చేసి ప్రజల్లో అశాంతి రేపేలా, రెచ్చగొట్టేలా ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్‌లో పోస్టులు చేసినట్లు పోలీసులు గుర్తించారు. 353(1సీ), 353(2), 192, 196(1), 61(1)(ఏ) సెక్షన్ల కింద దిలీప్, క్రిశాంక్‌పై కేసునమోదు చేశారు.