![]() |
![]() |
by Suryaa Desk | Sun, Apr 06, 2025, 01:55 PM
మార్కెట్‌లో పసిడి, వెండికి ఎల్లప్పుడూ డిమాండే ఉంటుంది.. అయితే.. గత కొంతకాలం నుంచి బంగారం, వెండి ధరలు నాన్‌స్టాప్‌గా పరుగులు పెడుతూ రికార్డు స్థాయికి చేరుకున్నాయి.. ఈ క్రమంలో ట్రంప్ టారిఫ్స్ బాదుడుతో అటు స్టాక్ మార్కెట్లు.. ఇటు ఎల్లో మెటల్స్.. మరోవైపు క్రూడ్ ఆయిల్ అన్ని అతలాకుతలమవుతున్నాయి.. స్టాక్ మార్కెెట్ లు భారీగా పతనమయ్యాయి.. ఒక్కరోజులోనే బంగారం ధర భారీగా తగ్గింది. అయితే, అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం.. గోల్డ్, సిల్వర్ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి.. ఒక్కోసారి ధరలు తగ్గితే.. మరికొన్నిసార్లు పెరుగుతుంటాయి.. తాజాగా.. బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.. 06 ఏప్రిల్ 2025 ఆదివారం ఉదయం ఆరు గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.83,100, 24 క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర రూ.90,660 గా ఉంది. వెండి కిలో ధర రూ.94,000 లుగా ఉంది. కాగా.. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది.24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 90,660 గా కొనసాగుతుంది. అదేవిధంగా కిలో వెండి ధర రూ.1,03,000 గా ఉంది.