![]() |
![]() |
by Suryaa Desk | Mon, Apr 07, 2025, 02:13 PM
బైక్ అదుపు తప్పి కింద పడి వ్యక్తి మృతి చెందిన ఘటన భీమ్‌గల్ మండలంలో ఆదివారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. మృతుడు బైక్‌పై మోర్తాడ్ నుంచి భీమ్‌గల్ వైపు వెళ్తుండగా.
మార్గమధ్యలో జాగిర్యాల్ గ్రామ శివారులో రోడ్డుపై అకస్మాత్తుగా కిందపడిపోయాడు. ముక్కుకి తీవ్రగాయాలయ్యాయి. అధిక రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.