![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 09, 2025, 02:00 PM
TG: సిద్దిపేట జిల్లా తొగుట మండలం కాన్గల్‌లో బర్డ్ ఫ్లూ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. దీంతో, కోళ్ల ఫామ్ పరిసరాల్లో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఫామ్‌లో పని చేస్తున్నవారికి డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. బర్డ్ ఫ్లూతో ఇప్పటికే 20 వేలకు పైగా కోళ్లు మృతి చెందాయి. మిగిలిన 50 వేల కోళ్లను చంపేయాలని అధికారులు నిర్ణయించుకున్నారు. ఇందుకు 20 టీములుగా ఏర్పడి కోళ్లను చంపేసి పూడ్చేస్తున్నట్లు తెలిపారు.