![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 09, 2025, 04:26 PM
వేసవికాలంలో ప్రయాణికులకు, కలెక్టరేట్ కు వచ్చే సందర్శకులకు ఇబ్బందులు కలగకుండా బస్ స్టాప్ వద్ద చలివేంద్రం ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. బుధవారం పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్ ఆవరణలోని బస్టాప్ వద్ద ఏర్పాటు చేసిన చలి వేంద్రాన్ని అదనపు కలెక్టర్ వేణుతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ శ్రీనివాస్, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి పాల్గొన్నారు.