![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 09, 2025, 04:31 PM
రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో నిర్వహించిన హనుమాన్ పూజా కార్యక్రమంలో సిరిసిల్ల శాసనసభ్యులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హనుమాన్ భక్తులతో కలిసి బుధవారం పాల్గొన్నారు. అనంతరం హనుమాన్ దీక్షా స్వాములను కేటీఆర్ ఆప్యాయంగా పలుకరించారు. స్వాములతో కలిసి కేటీఆర్ భోజనం చేశారు. కేటీఆర్‌తో స్వాములు ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. కేటీఆర్ వెంట సిరిసిల్ల జిల్లా నాయకులు ఉన్నారు. మరికాసేపట్లో కేటీఆర్ గంభీరావుపేటలో పెద్దమ్మ తల్లి ఆలయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం 5 గంటలకు కోనరావుపేట మండలం మల్కపేటలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు.