![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 09, 2025, 05:38 PM
కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్లపై రూ. 50 లను అదనంగా పెంచడం వల్ల సామాన్య, మధ్య తరగతి కుటుంబాలపై మరింత ఆర్థిక భారం పడుతుందని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
వంట గ్యాస్ సిలిండర్ల ధర పెంపునకు నిరసనగా బుధవారం సీపీఐ ఆధ్వర్యంలో ఖాళీ సిలిండర్లతో ర్యాలీ నిర్వహించి పట్టణంలోని కోదాడ జడ్చర్ల జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు.