![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 11, 2025, 04:27 PM
సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తున్న సంస్థ తెలంగాణ జాగృతి అని BRS నేత కవిత అన్నారు. ఉమ్మడి ఏపీలోనే దీక్ష చేసి అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహాన్ని సాధించుకున్నామని గుర్తుచేశారు. అసెంబ్లీ పాస్ చేసిన బీసీ బిల్లులను కేంద్రం ఆమోదించేలా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలన్నారు. 42% రిజర్వేషన్ల సాధన యుద్దం ఇక్కడ ఆగదని.. ఢిల్లీ వరకు వెళ్తుందని చెప్పారు. నెక్లెస్ రోడ్డు పరిసరాల్లో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ యోచనను స్వాగతిస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్‌పై కాసేపటి క్రితం విగ్రహ ఏర్పాటుకు స్థల పరిశీలన చేశారని తెలిసింది. కానీ పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో కూడా ఏర్పాటు చేయాలి. అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు చేసే వరకు పోరాటం కొనసాగుతుంది అని కవిత స్పష్టం చేశారు.