|
|
by Suryaa Desk | Fri, May 30, 2025, 04:23 PM
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇప్పటి వరకు 2.10లక్షల లబ్ధిదారులు ఎంపికైనట్లు వెల్లడించారు. వచ్చే నెల 10లోగా మిగతా లబ్ధిదారుల జాబితా సిద్ధమవుతుందని చెప్పారు. ‘పైలట్ ప్రాజెక్టులో 42వేల ఇళ్లు మంజూరు చేయగా.. 24వేలు ప్రారంభమయ్యాయి. సుమారు 100 ఇళ్లు గృహప్రవేశానికి సిద్ధమయ్యాయి. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు 40శాతం పేర్లు ఇవ్వనున్నాం. మిగతా 60% ఇందిరమ్మ కమిటీలు ఎంపిక చేస్తాయి’ అని పేర్కొన్నారు.