|
|
by Suryaa Desk | Fri, May 30, 2025, 04:37 PM
మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వరద పోటెత్తింది. 18 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా మే నెలలో 12 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 82,000 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 7.389 టీఎంసీలుగా ఉంది.