|
|
by Suryaa Desk | Fri, May 30, 2025, 04:55 PM
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక ప్రకారం, రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు.
మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయగా, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.