|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 10:55 AM
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ఈ నెల మొదటి 19 రోజుల్లోనే రూ.157.29 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది. గతేడాది డిసెంబర్ నెలలో మొత్తం అమ్మకాలు రూ.88.28 కోట్లు మాత్రమే. బీర్ అమ్మకాలు తగ్గినప్పటికీ, బ్రాందీ, విస్కీ అమ్మకాలు 78.17 శాతం పెరిగాయి. ఎన్నికల్లో అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకోవడానికి భారీగా మద్యం పంచినట్లు సమాచారం. ఎన్నికల ప్రచారంలో రూ.10 లక్షలు ఖర్చు చేసిన అభ్యర్థులు, అందులో రూ.4 లక్షలు మద్యం కోసమే వెచ్చించినట్లు తెలుస్తోంది.