|
|
by Suryaa Desk | Mon, Feb 09, 2026, 03:08 PM
ది రాజాసాబ్' చిత్రం వైఫల్యంతో దర్శకుడు మారుతి కెరీర్ తీవ్ర గందరగోళంలో పడింది. ఎలాంటి నేపథ్యం లేకుండా పరిశ్రమలోకి వచ్చి.. 'ఈరోజుల్లో, బస్టాప్' వంటి చిత్రాలతో నిర్మాతలకు నమ్మకాన్ని కలిగించారు. స్టార్ హీరోతో సినిమా తీసి పరిశ్రమలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని ఆశించారు. అయితే ప్రభాస్ రాజాసాబ్ సినిమా వైఫల్యం మారుతిని ఊహించని విమర్శల వైపు నెట్టింది. ప్రస్తుతం చిన్న హీరోలతో సినిమా తీయలేక, పెద్ద హీరోలతో ముందుకు వెళ్ళలేక మధ్యలో నిలిచిపోయిన పరిస్థితిలో ఉన్నారని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Latest News