|
|
by Suryaa Desk | Mon, Feb 09, 2026, 03:23 PM
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'స్పిరిట్' సినిమా నుంచి విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. స్క్రిప్ట్, కీలక సన్నివేశాల చిత్రీకరణ విషయంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో ప్రకాష్ రాజ్ కు వాగ్వాదం జరిగిందని, అందుకే ఆయనను పక్కన పెట్టారని ప్రచారం సాగుతోంది. ఈ వార్తలపై చిత్ర బృందం నుంచి అధికారిక స్పందన రాలేదు. గతంలో హీరోయిన్ దీపికా పదుకొణె కూడా ఇదే కారణాలతో సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. 'స్పిరిట్' 2027 మార్చి 5న విడుదల కానుంది.స్పిరిట్ మూవీ గురించి విషపూరిత ప్రచారం చేస్తున్న అందరికీ చెప్పొచ్చేదేంటంటే.. ఇంకా సినిమాలో నా సీన్స్ షూటింగే మొదలవలేదు. కానీ, అంతలోనే వాట్సాప్ ఫ్యాక్టరీలో ఏవేవో కథనాలు అల్లేస్తున్నారు. ఇప్పటికైనా మేల్కోండి, పోయి మీ పని మీరు చూసుకోండి ట్వీట్ చేశాడు. దీనికి నవ్వుతున్న ఎమోజీలను జత చేశాడు. దీంతో స్పిరిట్ నుంచి ప్రకాశ్ రాజ్ తప్పుకున్నాడన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది. స్పిరిట్ విషయానికి వస్తే.. ప్రభాస్, ప్రకాశ్‌రాజ్‌తో సహా వివేక్ ఒబెరాయ్, తృప్తి డిమ్రి, కాంచన ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం 2027 మార్చి 5న విడుదల కానుంది.
Latest News